Raghu Ramakrishna Raju: నా జుట్టు ఎలా ఉంటే నీకెందుకు? నా జుట్టుకు, నీకు ఏం సంబంధం?: దేవేందర్ రెడ్డిపై రఘురామకృష్ణరాజు ఫైర్

Raghu Ramakrishna Raju fires on Devender Reddy
  • రఘురాజు విగ్గు ఊడినట్టేనా? అని దేవేందర్ రెడ్డి ఎద్దేవా
  • సరిగ్గా నిలబడితే నా బొడ్డు వరకు కూడా రావు అంటూ రఘురాజు ఫైర్
  • పదవి నుంచి దేవేందర్ ను తొలగించాలని డిమాండ్
ఏపీ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దేవేందర్ రెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. తన జుట్టు విషయం ఆయనకెందుకని ప్రశ్నించారు. గతంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో (ఇటీవలి కాలంలో వైయస్సార్సీపీ అని సంబోధించడాన్ని రఘురాజు ఆపేశారు) దేవేందర్ రెడ్డి పని చేశారని... ఇప్పుడు డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించిందని చెప్పారు. ఆయన పనేదో ఆయన చేసుకుంటే ఇబ్బంది లేదని... తన జుట్టు గురించి ఆయనకెందుకని మండిపడ్డారు.

'గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు, స్వపక్షంలో విపక్షమంటూ, మాటతో సరిపెట్టుకునేదానికి వేటు దాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్టేనా? విగ్గు ఊడిపోతే రేపటి నుంచి ఎలా తిరుగుతారో?' అని తనపై దేవేందర్ రెడ్డి కామెంట్లు చేశారని రఘురాజు మండిపడ్డారు.

 'పిచ్చోడా... నువ్వు సరిగ్గా నిలబడినా నా బొడ్డు వరకు రావు. నీకు నా జుట్టు ఎలా కనపడిందో? అందరూ నీలాగే నల్లగా, పొట్టిగా, వికారంగా ఉండాలని నీవు కోరుకుంటే నేనేమీ చేయలేను. నా జుట్టు ఎలా ఉంటే నీకెందుకు? నా జుట్టుకు నీకు ఏం సంబంధం?' అని మండిపడ్డారు. లోక్ సభ సభ్యుడినైన తనపై నీచమైన వ్యాఖ్యలు చేసిన దేవేందర్ రెడ్డిని ఆ పోస్టు నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని రఘురాజు హెచ్చరించారు.
Raghu Ramakrishna Raju
Devender Reddy
YSRCP

More Telugu News