కొవిడ్ సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు

13-08-2020 Thu 15:32
  • సమస్త కరోనా సమాచారం కోసం ఒకే నెంబర్
  • ఐవీఆర్ఎస్ ద్వారా వివరాలు తెలుసుకునే వెసులుబాటు
  • సమాచారంతో పాటు సహాయం కూడా పొందే వీలు
AP Government established new phone number for corona info

ఏపీలో కొవిడ్ సమాచారం తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్ కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనాపై సమాచారమే కాదు సహాయం కూడా పొందవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.