MS Dhoni: ఐపీఎల్ ముంగిట కరోనా పరీక్షలు చేయించుకున్న ధోనీ

Dhoni has underwent corona tests in Ranchi ahead of IPL
  • రాంచీలో ధోనీకి కరోనా టెస్టులు
  • ఈ సాయంత్రం రానున్న వైద్య నివేదిక
  • త్వరలోనే యూఏఈ బయల్దేరనున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. జట్టు సహచరుడు మోనూ సింగ్ తో కలిసి రాంచీలో కరోనా టెస్టులకు శాంపిల్స్ ఇచ్చాడు. నేటి సాయంత్రానికి ధోనీ కరోనా పరీక్షల నివేదిక రానుంది.

ఈ పరీక్షల్లో నెగెటివ్ వస్తే ధోనీ చెన్నై వెళ్లి సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొంటాడు. యూఏఈ వేదికగా ఐపీఎల్ తాజా సీజన్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. ఈ నెల మూడో వారంలో చెన్నై జట్టు యూఏఈ వెళ్లనుంది. కాగా, వ్యక్తిగత కారణాలతో రవీంద్ర జడేజా సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనడంలేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.
MS Dhoni
Corona Virus
Tests
Chennai Super Kings
IPL 2020
UAE

More Telugu News