Vijayawada: స్వర్ణప్యాలెస్, రమేశ్ ఆసుపత్రి యజమానుల కోసం హైదరాబాద్, విజయవాడలో గాలింపు

  • హోటల్‌ నిర్వహణతో తమకు సంబంధం లేదన్న రమేశ్ ఆసుపత్రి
  • కొనసాగుతోన్న విచారణ
  • నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలు
విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా రమేశ్ ఆసుపత్రి వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఇటీవల చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, హోటల్‌ నిర్వహణతో తమకు సంబంధం లేదని, అందులోని రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతను మాత్రమే తమ‌ ఆసుపత్రి నిర్వహించిందని ఇప్పటికే  రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం వివరించింది.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావుతో పాటు ఆసుపత్రి యజమాని రమేశ్ ఆచూకీని గుర్తించడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. వారి కోసం హైదరాబాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. అగ్ని ప్రమాద ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
Vijayawada
Hyderabad
Fire Accident

More Telugu News