ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి జాతీయ పతాకావిష్కరణ... కృష్ణా జిల్లాలో పతాకావిష్కరణ చేయనున్న సీఎం జగన్

13-08-2020 Thu 13:30
  • ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం
  • గౌరవ వందనం స్వీకరించే మంత్రుల జాబితా ఖరారు
  • ఉత్తర్వులు జారీచేసిన సాధారణ పరిపాలన విభాగం
CM Jagan will flag hoisting in Krishna district on Independence day
ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు 13 జిల్లాల్లో గౌరవవందనం స్వీకరించే ఉపముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం జారీ చేసింది.