TS High Court: హైకోర్టుకు హాజరైన తెలంగాణ సీఎస్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం!

  • కరోనాపై అంత నిర్లక్ష్యం ఎందుకు?
  • మా ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదు?
  • అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి?
TS CS Somesh Kumar attends High Court hearing

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు  ఆదేశాలతో ఈరోజు సోమేశ్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎస్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని సీఎస్ ను ప్రశ్నించింది. కరోనాపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీసింది.

ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను డబ్బుకోసం పీడిస్తున్నాయని... దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

More Telugu News