Pandula Ravindrababu: జడ్జిలపై తీవ్ర వ్యాఖ్యలు.. వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు!

Lawyerr Lakshminarayana complains on MLC Pandual to President of India
  • జగన్ వెంట్రుకను కూడా తాకలేరని వ్యాఖ్యానించిన పండుల
  • రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణ
  • ఇప్పటికే హైకోర్టు సీజేఐకి ఫిర్యాదు
ఇటీవలే వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు అప్పుడే వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంట్రుకను కూడా ఎవరూ తాకలేరని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భంగా కోర్టులు, జడ్జిలు కూడా జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఈ నేపథ్యంలో... కోర్టును, జడ్జిలను, లాయర్లను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రపతి, గవర్నర్ లకు మెయిల్ ద్వారా న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.

రవీంద్రబాబును ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో కోరారు. ఇటీవలి కాలంలో కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా కోర్టులను కించపరుస్తున్నారని... కోర్టుల ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు నేరుగా కలిసేందుకు గవర్నర్ అనుమతి కోరారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.
Pandula Ravindrababu
YSRCP
Jagan
Courts
President Of India

More Telugu News