H1B Visa: హెచ్‌1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం

  • వీసాదారులు తమ పాత ఉద్యోగ‌ం కొన‌సాగించేందుకు అనుమ‌తి 
  • వీసాదారులపై ఆధార‌ప‌డేవాళ్ల ప్రయాణాలకు అనుమతి
  • వారి జీవిత ‌భాగ‌స్వాములు, పిల్ల‌లకు కూడా
  • ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు నిర్ణయం
 US Allows H1B Visa Holders To Return For Same Jobs

అమెరికాలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌1బీ వీసా విషయంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌1బీ వీసాదారులు తమ పాత ఉద్యోగాన్ని కొన‌సాగించేందుకు అనుమ‌తి ఇచ్చింది. హెచ్‌1బీతోపాటు వివిధ రకాల విదేశీ వర్క్‌ వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకూ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రస్తుతం అమల్లో ఉంది.

అయితే, ఈ వీసాలపై నిషేధానికి ముందు ఏ ఉద్యోగం చేశారో, అదే ఉద్యోగంలో కొన‌సాగేందుకు అనుమ‌తి ఇస్తూ ట్రంప్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆ వీసాదారులపై ఆధార‌ప‌డేవాళ్లు, వారి జీవిత ‌భాగ‌స్వాములు, పిల్ల‌లు అగ్రరాజ్యం ప్ర‌యాణం చేసేందుకు అనుమ‌తి కల్పించారు.

కరోనా వ్యాప్తి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ వీసాలతో ఉన్న విదేశీ టెక్నిక‌ల్ స్పెష‌లిస్టులు, సీనియ‌ర్ లెవ‌ల్ మేనేజ‌ర్ల సేవలు ఎంతగానో అవ‌స‌రముందని అమెరికా పేర్కొంది. కాగా, ఈ వీసాలపై నిషేధం విధించడంతో ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు అమెరికాలోని కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

More Telugu News