మరో సినీ ద‌ర్శ‌కుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ

Thu, Aug 13, 2020, 09:29 AM
ajay tests positive for corona
  • ట్విట్టర్‌లో తెలిపిన ఆర్ఎక్స్ -100 సినిమా దర్శకుడు
  • 'త్వ‌ర‌లో వ‌స్తా.. ప్లాస్మా ఇస్తా' అంటూ అజ‌య్ భూప‌తి ట్వీట్
  • ప్ర‌స్తుతం 'మ‌హా స‌ముద్రం' సినిమా తీస్తున్న అజయ్
ఆర్ఎక్స్ -100 సినిమా దర్శకుడు అజ‌య్ భూప‌తికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'త్వ‌ర‌లో వ‌స్తా.. ప్లాస్మా ఇస్తా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయ‌న కరోనా నుంచి త్వరగా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఆర్ఎక్స్ -100 టైటిల్‌తో తీసిన తొలి సినిమాతోనే అజయ్ భూపతి సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆయన ప్ర‌స్తుతం 'మ‌హా స‌ముద్రం' అనే సినిమా ప‌నుల‌ను పూర్తి చేసుకుంటున్నారు. క‌రోనా వ్యాప్తి కట్టడయ్యాక ఈ సినిమా షూటింగ్ కొనసాగించనున్నారు. కాగా, ఇప్పటికే సినీ పరిశ్రమలో పలువురికి కరోనా సోకిన విషయం తెలిసిందే.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha