ఫ్యాక్ట్ చెక్... ఈ భయంకర వీడియో హైదరాబాద్, మెహిదీపట్నంలోది కాదు!

Thu, Aug 13, 2020, 08:59 AM
Fake Video Viral in Hyderabad
  • ఇటీవల హైదరాబాద్ లో వర్షాలు
  • హోర్డింగ్ విరిగిపడ్డట్టు వీడియో వైరల్
  • పాకిస్థాన్ లో వీడియోపై ఇక్కడ పుకార్లు
ఇటీవలి వర్షాలకు హైదరాబాద్, మెహిదీపట్నంలో ఓ బిల్ బోర్డు విరిగి పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. వేర్వేరు బైకులపై వస్తున్న యువకులపై బిల్ బోర్డు గాల్లో ఎగిరి వస్తూ పడగా, వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగిందంటూ, ఫేస్ బుక్ లో ఓ యూజర్ పోస్ట్ చేయగానే అది వైరల్ అయింది.

వాస్తవానికి ఇది పాకిస్థాన్ లోని కరాచీలో జరిగింది. ఈ నెల 6వ తేదీన కరాచీ మెట్రోపోల్ హోల్ సమీపంలో ఇది జరిగిందనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. పాకిస్థాన్ టీవీ వార్తా చానెళ్లు దీన్ని ప్రసారం చేశాయి కూడా. ఆ వెంటనే నగరంలోని అన్ని బిల్ బోర్డులనూ తొలగించాలని కమిషనర్ కార్యాలయం అధికారులను ఆదేశించింది కూడా. ఈ వీడియో హైదరాబాద్ లోనిది కాదంటూ, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ సైతం ట్వీట్ చేశారు. పాకిస్థాన్ వీడియోను మీరూ చూడవచ్చు. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha