Telangana: ఒకే కుటుంబంలో నలుగురికి సోకిన మహమ్మారి.. మనస్తాపంతో ఇంటిపెద్ద ఆత్మహత్య

Older Man Suicide in Nizamabad amid coronavirus fear
  • నిజామాబాద్‌లో ఘటన
  • ఇంటి వద్ద ఉంటూనే చికిత్స తీసుకుంటున్న వైనం
  • మనస్తాపంతో చెట్టుకు ఉరి వేసుకున్న ఇంటి పెద్ద

కుటుంబంలో తనతో సహా నలుగురు కరోనా బారినపడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన లోలం నడ్సిరాజన్న (63) కుటుంబం ఈ నెల 7న స్థానిక ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకుంది. ఫలితాల్లో రాజన్న, ఆయన కుమార్తె, ఇద్దరు మనవరాళ్లకు కరోనా సోకినట్టు వచ్చింది.

దీంతో ఇంటి వద్ద ఉంటూనే వారంతా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు, కుటుంబంలో నలుగురికి కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజన్న నిన్న పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News