Hardhik Pandya: నిన్ను చేతుల్లోకి తీసుకున్నాకే నా జీవితానికి అర్థం తెలిసింది: బాబును చూసుకుని మురిసిపోతున్న హార్దిక్ పాండ్యా భార్య

Natasha Adorablle Pic with Baby boy
  • గత వారం బాబుకు జన్మనిచ్చిన నటాషా
  • తాజాగా మరిన్ని పిక్స్ సోషల్ మీడియాకు
  • సూపరంటున్న అభిమానులు
గతనెల 30న హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్ కోవిచ్ దంపతులు తమ జీవితంలోకి ఓ ముద్దుల బాబును ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో, నటాషా ఓ బాబును ప్రసవించిందని హార్దిక్ చెప్పగానే ఫ్యాన్స్, సహచరుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గత వారంలో ఆసుపత్రిలో నుంచి తన ఫ్యామిలీ పిక్ ను షేర్ చేసుకున్న నటాషా, "నా కుటుంబం, నా హార్దిక్... నా పిల్లలు" అంటూ కామెంట్ పెట్టగా, అది వైరల్ అయింది.

ఇక తాజాగా, ఆమె పెట్టిన రెండు పిక్స్ ఇంటర్నెట్ మదిని దోచుకున్నాయి. తన బిడ్డను రెండు చేతులతో ఎత్తుకుని నటాషా ఆడిస్తున్న దృశ్యాలను చూస్తున్న నెటిజన్లు, సూపరంటున్నారు. బేబీ రోంపర్, సాక్స్, క్యాప్ ధరించిన బిడ్డను రెండు చేతులతో ఎత్తుకుని, బిడ్డ కళ్లల్లోకి చూస్తున్న నటాషా, తనలోని మాతృత్వాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తోంది. 
Hardhik Pandya
Natasha Stankowich
Baby Boy

More Telugu News