Secunderabad: డ్యూటీ నుంచి వచ్చి మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న స్టాఫ్‌నర్స్

Private Hospital staff nurse committed suicide in Secunderabad
  • సికింద్రాబాద్‌లో ఘటన
  • బాధితురాలిది నల్గొండ జిల్లా
  • నాలుగేళ్లుగా స్టాఫ్‌నర్స్‌గా విధులు
సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాలుగేళ్లుగా స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న ఓ యువతి మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డ గ్రామానికి చెందిన సౌందర్య (25)  సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూ ఆసుపత్రి హాస్టల్‌లోనే ఉంటోంది.

మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని హాస్టల్‌కు వచ్చిన సౌందర్య రాత్రయినా బయటకు రాకపోవడంతో స్నేహితులు అనుమానించారు. దీంతో గదిలోకి చూడగా విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు గదిని పరిశీలించారు. ఆమె పక్కన మత్తు ఇంజక్షన్ పడి ఉండడంతో అది తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Secunderabad
Staff Nurse
Suicide

More Telugu News