Bollywood: హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్.. పరిస్థితి విషమం!

Director Nishikant Kamat hospitalised
  • ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ 
  • తొలి చిత్రానికే జాతీయ అవార్డు
  • కాలేయ సంబంధ సమస్యలతో ఐసీయూలో చికిత్స
‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి, అదే సినిమాకు జాతీయ అవార్డు అందుకున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించింది నిషికాంతే. ‘ముంబై మేరీ జాన్’, ‘ఫోర్స్’,  ‘లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మూవీ  ‘హవా ఆనే దే’,  మరాఠీ సినిమా ‘సాచ్య ఆట ఘరాట్‌’ సినిమాల్లో నటించారు కూడా. బాలీవుడ్ నటుడు  జాన్‌ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ సినిమాలో విలన్‌ గానూ నటించి మెప్పించారు.
Bollywood
Nishikant kamat
Drishyam
Director
hospital

More Telugu News