Kamala Harris: అమెరికాలోని పరిస్థితులను ఆమె స్వయంగా అనుభవించారు: కమలా హ్యారిస్ పై జో బిడెన్ ట్వీట్

Joe Biden believes in Kamala Harris who contests for vice president
  • ఊపందుకున్న అమెరికా ఎన్నికల ప్రచారం
  • ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిసన్ ను ఎంపిక చేసిన జో బిడెన్
  • డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జో బిడెన్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఊపందుకున్నాయి. ప్రచారంలో డిమొక్రాట్లు, రిపబ్లికన్లు జోరుగా సాగిపోతున్నారు. ఇక డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న జో బిడెన్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ను ఎంపిక చేసుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

"భారత, జమైకా వలసజీవుల పుత్రికగా కమలా హ్యారిస్ రేపటి అమెరికాపై ఎంతో నమ్మకంతో పెరిగింది. అమెరికాలో పరిస్థితులను ఆమె స్వయంగా అనుభవించారు. నేను, కమలా విజయం సాధిస్తే... అమెరికన్ల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రతిరోజు వైట్ హౌస్ లో తీవ్రంగా శ్రమిస్తాం" అంటూ ట్వీట్ చేశారు.
Kamala Harris
Joe Biden
Vice President
Democrats
Elections
USA

More Telugu News