Donald Trump: మహిళను జోబిడెన్ ఎంపిక చేయడాన్ని పురుషులు అవమానంగా భావించవచ్చు: ట్రంప్

Men May Be Insulted By Joe Biden Picking Woman As Vice President says Trump
  • కమల హ్యారిస్ ను డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన బిడెన్
  • బిడెన్ ఒక వర్గానికి వ్యతిరేకి అయిపోయారన్న ట్రంప్
  • కొందరు మెచ్చుకునే అవకాశం కూడా ఉందని వ్యాఖ్య
అమెరికా అధ్యక్ష పదవికి త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో ఆ దేశంలో రాజకీయవేడి పెరిగింది. డెమోక్రాట్ల తరపున అధ్యక్షుడి ఎన్నికల బరిలోకి దిగిన జోబిడెన్... ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోయే అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమల హ్యారిస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోయే అభ్యర్థిగా బిడెన్ ఎంచుకున్నారని... ఈ నిర్ణయాన్ని ఆయన పార్టీలోని కొందరు పురుషులు అవమానంగా భావించే అవకాశం ఉందని చెప్పారు.

ఈ నిర్ణయంతో బిడెన్ ఒక వర్గానికి వ్యతిరేకిగా మారిపోయారని అన్నారు. పురుషులకు అవమానం జరిగిందని కొందరు అనొచ్చని... బిడెన్ సరైన నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అనొచ్చని ట్రంప్ చెప్పారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.
Donald Trump
USA
Kamala Harris
Joe Biden

More Telugu News