Anasuya: అవకాశాల కోసం తప్పు చేయకూడదు: అనసూయ

I never committed any mistake for offers says Anasuya
  • ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండొచ్చు
  • అయితే మనం స్పందించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది
  • ఛాన్సుల కోసం నేను ఎక్కడకూ వెళ్లలేదు
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండొచ్చని... అయితే మనం స్పందించే తీరుపైనే అది ఆధారపడి ఉంటుందని యాంకర్ అనసూయ తెలిపింది. అవకాశాల కోసం తప్పు చేయకుండా ఉండాలని చెప్పింది. ఛాన్సుల కోసం తాను ఎక్కడకీ వెళ్లలేదని తెలిపింది. అయితే వచ్చిన అవకాశాలను సక్సెస్ ఫుల్ గా ఉపయోగించుకున్నానని చెప్పింది. ఎంబీయే చదివిన తర్వాత తాను జాబ్ చేస్తూ యాంకరింగ్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టానని తెలిపింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా అనసూయ బిజీ ఆర్టిస్టుగా మారిన సంగతి తెలిసిందే. 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్ తో అదరగొట్టిన తర్వాత... వరుస ఆఫర్లను అనసూయ చేజిక్కించుకుంటోంది.
Anasuya
Anchor
Casting Couch
Tollywood

More Telugu News