Nara Lokesh: మీ వంశమే మోసానికి ప్రతిరూపం అని నిరూపించుకున్నావు జగన్: డ్వాక్రా చెల్లింపుల నేపథ్యంలో లోకేశ్ విమర్శలు

Nara Lokesh criticises  CM Jagan over self help groups
  • వైఎస్ పావలా వడ్డీ పేరుతో రూ.268 కోట్లు విదిల్చాడన్న లోకేశ్
  • జగన్ రూ.3 వేలకు బదులు రూ.1,500 ఇస్తున్నారని వెల్లడి
  • తండ్రిది వంచన, కొడుకుది విశ్వాసఘాతుకం అంటూ వ్యాఖ్యలు
ఏపీలో మహిళలకు డ్వాక్రా చెల్లింపుల అంశంలో సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శలు చేశారు. "డ్వాక్రా మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తానన్న మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీ పేరుతో ఐదేళ్లలో రూ.268 కోట్లు మాత్రమే విదిల్చాడు. నువ్వేమో నెలకు రూ.3 వేల చొప్పున ఐదేళ్లు ఇస్తామని చెప్పి, ఆ మొత్తంలో సగం కోసేసి రూ.1,500 చొప్పున నాలుగేళ్లకే పరిమితం చేశావు. మీ నాన్నది నయవంచన అయితే నీది విశ్వాసఘాతుకం. మీ వంశమే మోసానికి ప్రతిరూపం అని నిరూపించుకున్నావు జగన్!" అంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Nara Lokesh
Jagan
YS Rajasekhar Reddy
Andhra Pradesh

More Telugu News