Devineni Uma: విశాఖలోని బడా సంస్థలన్నీ వరుసగా పెద్దల చేతుల్లోకి పోతున్నాయి: దేవినేని ఉమ

Devineni Uma fires on Jagan
  • మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్
  • వాటాలు కొన్న ఫార్మా కంపెనీలు ఏవి?
  • సీఎం కార్యాలయం కోసం ఏర్పాట్లు నిజమేనా?
విశాఖలోని బడా సంస్థలను పెద్దలు హస్తగతం చేసుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... 'విశాఖలో వరుసగా 'పెద్దల' చేతుల్లోకి బడా సంస్థలు. మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్. ఇండస్ట్రియల్ విధానంలో నిబంధనల మార్పు ఫార్మా కంపెనీలకు ఉపయోగపడ్డాయా? వాటా కొన్న ఫార్మా కంపెనీలు ఏవి? అప్పులు ఎవరు తీరుస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఏర్పాట్లు నిజమేనా? ప్రజలకి చెప్పండి జగన్ గారూ' అని ప్రశ్నించారు. దీంతోపాటు వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలను షేర్ చేశారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Vizag
Properties

More Telugu News