Hyderabad: తాగుడుకు బానిసై కుమార్తెలను లైంగికంగా వేధిస్తున్న తండ్రి.. కడతేర్చిన ఆడబిడ్డలు

Daughters killed father in Hyderabad Jagadgirigutta
  • హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఘటన
  • ఏడాది క్రితం భార్య మృతి
  • తాడుతో గొంతు బిగించి చంపేసిన కుమార్తెలు
తాగొచ్చి లైంగికంగా వేధిస్తున్న తండ్రిని కుమార్తెలు కడతేర్చారు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే వ్యక్తి (45)కి 16, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఏడాది క్రితం అతడి భార్య మరణించగా, అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి కుమార్తెలను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం రాత్రి కూడా మరోమారు వేధింపులకు గురిచేయడంతో తమనుతాము రక్షించుకునేందుకు బాలికలు ఇద్దరు తండ్రిపై తిరగబడ్డారు. తండ్రి గొంతును తాడుతో గట్టిగా బిగించారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతడు ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Jagadgirigutta
father
murder
Crime News

More Telugu News