కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందిన మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి

12-08-2020 Wed 08:21
  • ఈ నెల 5న జ్వరం.. పరీక్షల్లో కొవిడ్ నిర్ధారణ
  • రెండు ఆసుపత్రులలో చికిత్స
  • సోమవారం గాంధీ ఆసుపత్రిలో చేరిక
Medchal dist DEO died with covid 19
తెలంగాణలో కరోనాకు మరో ప్రభుత్వాధికారి బలయ్యారు. మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఈవో) ఆర్‌పీ భాస్కర్ కరోనాకు చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. ఈ నెల 5న  జ్వరంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రెండు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో సోమవారం ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న భాస్కర్ పరిస్థితి విషమించడంతో నిన్న మృతి చెందారు. ఆయన మృతికి ఉద్యోగ సంఘాలు సంతాపం తెలిపాయి.