Actor Vijay: మహేశ్‌బాబు విసిరిన చాలెంజ్‌ను పూర్తి చేసిన తమిళ నటుడు విజయ్

Tamil Actor Vijay Completes Mahashbabu Challenge
  • తన ఇంటిలో మొక్క నాటిన విజయ్
  • గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్న నటుడు
  • ఇదో అద్భుత కార్యక్రమమని కితాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ తమిళ నటుడు విజయ్ తన ఇంటిలో మొక్కలు నాటి సవాలును పూర్తిచేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పడం మొక్కలు నాటడంలో మన అశ్రద్ధను ఎత్తి చూపుతోందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మొక్కలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్న ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని విజయ్ ట్వీట్ చేశారు.
Actor Vijay
Mahesh Babu
Tollywood
Green India Challenge

More Telugu News