పాకిస్థాన్ లో గ్రెనేడ్ ఎటాక్ చేసింది తామేనని ప్రకటించిన సిందూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ
- పాక్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ పై నిన్న దాడి
- ఐదుగురి మృతి.. పది మందికి తీవ్ర గాయాలు
- తమ భూమిపై పాక్ పెత్తనాన్ని మానుకోవాలని డిమాండ్
గత నెలలో కూడా ఈ రివల్యూషనరీ ఆర్మీ ఈ తరహా దాడులకు పాల్పడింది. అయితే ఆ దాడుల్లో రేంజర్లు ప్రాణాలు కోల్పోనప్పటికీ.. గాయాలపాలయ్యారు. సింధ్ ప్రాంతంపై పాకిస్థాన్ ప్రభుత్వం పెత్తనాన్ని మానుకోవాలని సిందూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. పాకిస్థాన్ నుంచి తమకు విముక్తి కలిగేంత వరకు పోరాటం ఆగదని ఈ సందర్భంగా ప్రకటించింది.