ఏపీ మహిళలకు శుభవార్త.. రేపే 'జగనన్న చేయూత' ప్రారంభం

Tue, Aug 11, 2020, 06:05 PM
Jagananna Cheyutha scheme to be launched tomorrow
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూత
  • ప్రతి ఏటా రూ. 18,750 ఆర్థిక సాయం
  • ఈ ఏడాదికి రూ. 4,700 కోట్ల కేటాయింపు
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న చేయూత' పథకం రేపు ప్రారంభం కానుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ప్రతి ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందనున్నారు. నాలుగేళ్లకు గాను ఈ పథకానికి సుమారు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ ఏడాదికి రూ. 4,700 కోట్లు కేటాయించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha