కరోనాపై విజయం.. వ్యాక్సిన్‌ వచ్చేసింది.. రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా

Tue, Aug 11, 2020, 03:01 PM
russia develops vaccine
  • అధికారిక ప్రకటన చేసిన పుతిన్
  • రష్యా నుంచి కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌
  • పుతిన్ కూతురికి ఇప్పటికే టీకా
  • మొదట వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు టీకా
కరోనా వైరస్‌తో వణికిపోతోన్న ప్రపంచానికి రష్యా ఓ శుభవార్త తెలిపింది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటికే పలుసార్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికారికంగా ప్రకటన చేశారు.    

తన కుమార్తెకు టీకా వేయించినట్లు పుతిన్ ప్రకటన చేశారు. ఈ టీకా ద్వారా రోగనిరోధకత పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు. మొదట వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది.

కరోనా వ్యాక్సిన్‌ను ఈ రోజు ఉదయమే రిజిస్టర్ చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేయించిన తొలి దేశం తమదేనని భావిస్తున్నట్లు చెప్పారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha