Ram Madhav: అంత పెద్ద యూపీకే ఒక్క రాజధాని ఉంది.. ఏపీకి మూడు అవసరమా?: రాంమాధవ్

  • రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు
  • మూడు రాజధానుల విషయంలో జరిగే అవినీతిని ప్రశ్నించండి
  • వీధుల్లో నిలబడి పోరాడితేనే ముందుకు వెళ్లగలుగుతాం
Is AP need 3 capitals questions Ram Madhav

ఆంధ్రప్రదేశ్ కంటే ఉత్తరప్రదేశ్ నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుందని... అంత పెద్ద రాష్ట్రానికి ఒకే రాజధాని ఉందని... ఏపీకి  మూడు రాజధానులు అవసరమా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. అయితే, రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు.

టీడీపీ హయాంలో అమరావతిలో జరిగిన అవినీతిని ప్రశ్నించామని... ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో జరిగే అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ పోరాడాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా వీధుల్లో నిలబడి పోరాటం చేసినప్పుడే ముందుకు వెళ్లగలుగుతామని రాంమాధవ్ తెలిపారు. ప్రజలకు అండగా నిలబడే పార్టీగా ఎదగాలని క్యాడర్ కు హితబోధ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తులను సంఘర్షణ వైఖరితో ఎదుర్కోవాలని చెప్పారు. అధికార పార్టీ దురంహంకారాన్ని ఢీకొనాలని అన్నారు. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలని మార్గనిర్దేశం చేశారు.

More Telugu News