Disha: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ మృతదేహం నగ్నంగా ఉందనే వార్తల్లో నిజం లేదు: ముంబై పోలీసులు

Disha is not naked at the time of death says Mumbai police
  • జూన్ 9న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దిశ
  • ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని వార్తలు
  • చనిపోయే సమయంలో ఆమె ఒంటిపై దుస్తులు ఉన్నాయన్న పోలీసులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఐదు రోజుల ముందు అతని మాజీ మేనేజర్ దిశ సలియాన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, చంపేశారని... ఆమె మృతదేహం నగ్నంగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారనే వార్తలు వచ్చాయి.

అయితే, ఈ వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. వాటిలో వాస్తవం లేదని చెప్పారు. చనిపోయే సమయంలో ఆమె ఒంటిపై దుస్తులు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఆమె స్నేహితులు ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు.

దిశ చనిపోయిన ముందు రోజు రాత్రి జరిగిన పార్టీకి ఆమె స్నేహితులు, ప్రియుడు మాత్రమే హాజరయ్యారని పోలీసులు తెలిపారు. ఆ పార్టీకి రాజకీయ నాయకులు హాజరు కాలేదని చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయేమో అని పరీక్షించామని... ఆ తర్వాతే పంచనామా నిర్వహించామని తెలిపారు. చనిపోయే సమయానికి ఆమె నగ్నంగా ఉందనేది అసత్య ప్రచారం మాత్రమేనని చెప్పారు. జూన్ 9వ తేదీ రాత్రి ముంబైలోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి దిశ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Disha
Sushant Singh Rajput
Bollywood
Suicide

More Telugu News