Samantha: హీరోయిన్ సమంతను ఆకాశానికెత్తేసిన ప్రియమణి

samanta has so much demand in industry
  • పెళ్లి తర్వాత  కూడా సమంతకు చాలా డిమాండ్ 
  • తన ప్రతిభతో చాలా మందికి ఆదర్శంగా నిలిచింది
  • సమంత తన శరీరాకృతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది
  • నాకు కూడా సినీ పరిశ్రమలో ఛాన్సులు వస్తూనే ఉన్నాయి
హీరోయిన్ సమంతను సినీనటి ప్రియమణి ఆకాశానికెత్తేసింది. సినీనటుడు అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి జరిగిన తర్వాత కూడా సమంత వరుసగా సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. పెళ్లయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆమె రాణిస్తోన్న తీరుపై ప్రియమణి ప్రశంసల జల్లు కురిపించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ... వివాహం జరిగిన అనంతరం కూడా సమంతకు చాలా డిమాండ్ ఉందని తెలిపింది. సమంత తన ప్రతిభతో చాలా మందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పింది. హీరోయిన్లకు నిశ్చితార్థం జరిగిందని తెలిస్తే ఒకప్పుడు అవకాశాలు తగ్గిపోయేవని ప్రియమణి, అయితే, ప్రస్తుతం సినీ పరిశ్రమ మరోలా ఆలోచిస్తోందని తెలిపింది. ఇందుకు మంచి ఉదాహరణగా సమంత నిలుస్తోందని చెప్పింది.

వివాహం అనంతరం కూడా సమంతకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రియమణి గుర్తు చేసింది. సమంత తన శరీరాకృతి విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయని చెప్పింది. తనకు కూడా సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.
Samantha
priyamani
Tollywood

More Telugu News