Martinez: పక్కింటివాళ్లకు అసౌకర్యం కలిగించాడని కొడుక్కి వింత శిక్ష విధించిన తల్లిదండ్రులు!

  • తల్లిదండ్రుల కారుతో కొడుకు విన్యాసాలు
  • బాలుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • కొడుకును విడిపించుకున్న తల్లిదండ్రులు
  • ఇంటి బయటే రోడ్డుపై ఉండాలంటూ కొడుక్కి శిక్ష
US boy was punished by his own parents instead of police

అమెరికాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. తమ కుమారుడ్ని దండించేందుకు ఆ తల్లిదండ్రులు విచిత్రమైన శిక్ష వేశారు. కుమారుడ్ని రోడ్డు పక్కనే ఉండాలని, ఇంట్లోకి రావొద్దని ఆదేశించారు. అంతేకాదు, అతడి బెడ్ సహా అన్ని వస్తువులను రోడ్డు పక్కకు షిఫ్ట్ చేశారు. అమెరికాలోని ఆరిజోనాలో నివసించే ఏంజెల్ మార్టినెజ్ (14) అనే కుర్రాడు ఓ రోజు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి తమ కారుతో విన్యాసాలు చేయసాగాడు. మార్టినెజ్ జోరుతో ఇరుగుపొరుగు వారు ఎంతో ఇబ్బందిపడ్డారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న మార్టినెజ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎలాగోలా తమ కొడుకును విడిపించుకొచ్చారు. అయితే చేసిన తప్పుకు శిక్ష విధించాలంటూ అతడ్ని రోడ్డు పక్కనే ఉండాలంటూ ఆదేశించారు. అంతేకాదు, అక్కడ ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఆ బోర్డు పై... "నా తల్లిదండ్రుల కారును దొంగిలించాను. వారి అనుమతి లేకుండా తీసుకోవడమే కాకుండా వేగంగా నడిపాను. నన్ను క్షమించండి" అని రాసి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News