Bids: ఐపీఎల్ కొత్త స్పాన్సర్ కోసం బిడ్లు ఆహ్వానించిన బీసీసీఐ

BCCI invites bids for a new sponsor of IPL latest season
  • ఐపీఎల్ నుంచి తప్పుకున్న వివో
  • తాజా సీజన్ కోసం కొత్త స్పాన్సర్ వేటలో బీసీసీఐ
  • ఆగస్టు 14 బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ
ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. నాలుగున్నర నెలల కాలపరిమితి కోసం స్పాన్సర్ కావాలంటూ బిడ్డింగ్ కు ఆహ్వానం పలికింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా 13 నిబంధనలతో కూడిన బిడ్డింగ్ ఆహ్వాన ప్రకటన విడుదల చేశారు. బిడ్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు 14 అని వెల్లడించారు. ఆగస్టు 18న బిడ్డింగ్ లో విజేతను ప్రకటించనున్నారు. స్పాన్సర్ షిప్ హక్కులు ఆగస్టు 18 నుంచి 2020 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటాయి. అయితే, బిడ్డింగ్ లో పాల్గొనాలనుకునే సంస్థల టర్నోవర్ రూ.300 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలని బీసీసీఐ తన నిబంధనల్లో స్పష్టం చేసింది.
Bids
Sponsor
IPL 2020
BCCI
VIVO
China

More Telugu News