బిగ్ బాస్-14 కోసం సల్మాన్ ఖాన్ కు కళ్లు చెదిరే పారితోషికం!
- త్వరలోనే బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ ప్రారంభం
- ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పై ప్రోమో చిత్రీకరణ!
- హిందీ బిగ్ బాస్ కు అత్యధిక సీజన్లలో హోస్ట్ గా వ్యవహరించిన సల్మాన్
త్వరలోనే 14వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో సల్మాన్ ఖాన్ పై ప్రోమో చిత్రీకరిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ సీజన్ కోసం సల్మాన్ కు కళ్లు చెదిరే రీతిలో రూ.16 కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇది దక్షిణాది భాషల అగ్రహీరోలు ఒక సినిమాకు తీసుకునే మొత్తంతో సమానం! కానీ సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్ హోస్ట్ గా ఉన్నాడంటే ఆ కార్యక్రమం రేంజ్ ఎక్కడికి వెళుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే టీఆర్పీ పరంగా హిందీ బిగ్ బాస్ షో అనేక రికార్డులు సొంతం చేసుకోవడంలో సల్మాన్ పాత్ర కూడా ఉంది.