KCR: మా ప్రాజెక్టులపై ఏపీ అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తోంది: సీఎం కేసీఆర్

CM KCR accuses AP Government makes false allegation on irrigation projects
  • ఏపీ ఆరోపణలు నిరాధారమన్న కేసీఆర్
  • కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని వెల్లడి
  • ఏపీ సర్కారు కావాలనే వివాదాలు సృష్టిస్తోందని ఆరోపణ
తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. నిర్మాణంలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ నిరాధారమైన ఫిర్యాదులు చేస్తోందని, ఏపీ చేస్తున్నవి అర్థం పర్థం లేని ఆరోపణలని అన్నారు.

ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి, ఎంతో మర్యాదలు చేసి నీటి కేటాయింపుల అంశాలపై మాట్లాడానని తెలిపారు. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పానని, తమకు భేషజాలు లేవని స్పష్టంగా చెప్పానని, అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం వివాదాలకు తెరలేపుతోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవాలు వివరించి ఏపీ మరోసారి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరఫున సమర్థంగా వాదనలు వినిపించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
KCR
Andhra Pradesh
Irrigation Project
Centre

More Telugu News