Amitabh Bachchan: అమితాబ్ కు జాబ్ ఆఫర్ ఇచ్చిన అభిమాని!

Fan offers jog to Amitabh
  • కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న బిగ్ బీ
  • తన ఉద్యోగం పట్ల ఇటీవల అనుమానం వ్యక్తం చేసిన వైనం
  • తనకు ఉద్యోగం పక్కా అయిందని బ్లాగ్ ద్వారా తెలిపిన అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కరోనా బారిన పడిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. మరోవైపు, కరోనాతో బాధపడుతున్న సమయంలో కూడా అమితాబ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు.

తనకు ఇకపై ఉద్యోగం దొరుకుతుందో, లేదో అంటూ సరదాగా ఓ అనుమానాన్ని ఇటీవల ఆయన వ్యక్తం చేశారు. 65 ఏళ్లు పైబడిన సినీ, టీవీ నటులు షూటింగుల్లో పాల్గొనవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఇవి వివక్షపూరితమైన ఉత్తర్వులు అని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే, అమితాబ్ అలా కామెంట్ చేయడంతో అతని అభిమానుల్లో ఒకరు జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బిగ్ బీ తన బ్లాగ్ ద్వారా తెలియజేశారు. తనకు ఉద్యోగం పక్కా అయిందని చెప్పారు.
Amitabh Bachchan
Bollywood
Corona Virus

More Telugu News