Chidambaram: కనిమొళికి విమానాశ్రయంలో ఎదురైన ఘటనపై చిదంబరం వ్యాఖ్యలు

  • మీరు భారతీయులు కాదా అని కనిమొళిని ప్రశ్నించిన అధికారిణి
  • ఇది కొత్తేమీ కాదన్న చిదంబరం
  • తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడి
Chidambaram responds on Kanimozhi issue

డీఎంకే నేత కనిమొళికి ఇటీవల ఓ విమానాశ్రయంలో ఎదురైన చేదు అనుభవంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. తమిళుడైన చిదంబరం సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ, డీఎంకే ఎంపీ కనిమొళికి చెన్నై ఎయిర్ పోర్టులో ఎదురైన దురదృష్టకర అనుభవం ఆశ్చర్యపోదగింది ఏమీకాదని పేర్కొన్నారు. గతంలో తాను ఇలాంటి అనుభవాలు ఎన్నోసార్లు చవిచూశానని వెల్లడించారు. ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్య పౌరుల వరకు తనను హిందీలో మాట్లాడలేరా అంటూ అడిగిన సందర్భాలున్నాయని వివరించారు. కొన్నిసార్లు టెలిఫోన్ లోనూ, కొన్నిసార్లు ముఖంపైనే అడిగారని చిదంబరం వాపోయారు.

ఇటీవలే కనిమొళి విమానాశ్రయంలో ఓ సీఐఎస్ఎఫ్ అధికారిణి చేతిలో చేదు అనుభవం రుచి చూశారు. ఆ అధికారిణి హిందీలో మాట్లాడుతుండగా, తనతో తమిళంలో కానీ, ఇంగ్లీష్ లో మాట్లాడాలని కనిమొళి కోరారు. దాంతో ఆ అధికారిణి... మీరు భారతీయులు కాదా? అని ప్రశ్నించడం కనిమొళిని అసంతృప్తికి గురిచేసింది.

More Telugu News