Multi System Inflamatory Syndrome: అమెరికా సహా మరో నాలుగు దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సరికొత్త జబ్బు!

  • క్రమంగా విస్తరిస్తున్న మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్
  • అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో కొత్త జబ్బు
  • పిల్లలపై ప్రభావం చూపుతున్న వైనం
MSIC spreading in USA along with other 4 countries

ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. మహమ్మారిని ఎలా నియంత్రించాలో అర్థంకాక అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్, మెడిసిన్ వస్తే కానీ దీన్ని అరికట్టలేమనే భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో జబ్బు ఇప్పుడు భయాందోళనలకు కారణమవుతోంది. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఎస్ఐసీ) అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ ఈ జబ్బును గుర్తించింది.

ఈ కొత్త వ్యాధి లక్షణాల విషయానికి వస్తే... ఇది ప్రధానంగా పిల్లలపైనే ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొలుత జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపించడం మొదలవుతుంది. చర్మంపై దద్దులు, గుండెల్లో మంట వంటివి కనిపిస్తాయి. మరో ప్రధాన అంశం ఏమిటంటే... కరోనా బారిన పడిన పిల్లల్లో ఈ కొత్త వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే అమెరికాలో దాదాపు 600 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్టు సమాచారం. అమెరికాతో పాటు స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి యూరప్ దేశాల్లో కూడా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు. యూఎస్ లో ఇప్పటి వరకు దీని బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News