తనకు కరోనా సోకిందనే వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందన!

Mon, Aug 10, 2020, 12:12 PM
Ram Gopal Varma condemns the news that he is suffering from Corona
  • నాకు కరోనా వచ్చిందనే వార్తల్లో నిజం లేదు
  • ఈ వార్త అబద్ధమైనందుకు వాళ్లు బాధపడి ఉంటారు
  • భవిష్యత్తులో వారి కోరిక నెరవేరాలని ఆశిస్తున్నా
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతుంటుంది. లాక్ డౌన్ సమయంలో కూడా వర్మ పతాక శీర్షికల్లోనే ఉన్నాడు. వరుసబెట్టి సంచలన సినిమాలను విడుదల చేస్తూ కేక పుట్టించాడు. తాజాగా వర్మకు సంబంధించి ఓ పుకారు షికారు చేస్తోంది. వర్మకు కరోనా సోకిందనేదే ఆ వార్త.

వర్మ జ్వరంతో బాధపడుతున్నారని... ఆయనను కలిసిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ, కౌంటర్ ఇచ్చాడు. తనకు కరోనా వచ్చిందనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ వార్త అబద్ధమైనందుకు వాళ్లు బాధపడి ఉంటారని సెటైర్ వేశాడు. భవిష్యత్తులో వారి కోరిక నెరవేరాలని ఆశిస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతానికైతే తాను చాలా ఫిట్ గా ఉన్నానని తెలిపాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha