Velagapudi Gopalakrishna: అమరావతి రైతులకు మద్దతు పలికిన బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ... సస్పెండ్ చేసిన సోము వీర్రాజు

AP BJP Chief Somu Veerraju suspends Velagapudi Gopalakrishna
  • ఏపీ బీజేపీలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం
  • ఇప్పటికే ఓవీ రమణపై వేటు
  • ఇప్పుడు వెలగపూడి వంతు
ఏపీ బీజేపీ నేతల మధ్య రాజధాని అమరావతిపై భేదాభిప్రాయాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడిన మరో నేతను బీజేపీ నుంచి సాగనంపారు. బీజేపీ విధానాలకు విరుద్ధంగా  వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.

ఇప్పటికే బీజేపీ డాక్టర్ ఓవీ రమణను పార్టీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని ఓవీ రమణ ఓ వ్యాసం రాయడం సస్పెన్షన్ కు దారితీసింది. కాగా, వెలగపూడి గోపాలకృష్ణ రాజధాని రైతుల పక్షాన మాట్లాడుతూ, అమరావతి కోసం 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు బీజేపీ మద్దతుగా నిలవలేకపోతోందని అన్నారు. ఆపై, తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.
Velagapudi Gopalakrishna
Suspension
AP BJP
Somu Veerraju
Amaravati

More Telugu News