'చిన్న చేపల వేపుడు' వీడియోను వాయిదా వేసిన చిరంజీవి

Sun, Aug 09, 2020, 06:50 PM
Chiranjeevi postponed his fish fry recipe video in the wake of Vijayawada tragedy
  • చింత తొక్కుతో చేపల వేపుడు అంటూ ట్వీట్ చేసిన చిరు
  • సాయంత్రం వీడియో రిలీజ్ చేస్తానని వెల్లడి
  • అయితే, విజయవాడ ప్రమాదంతో కలత చెందానని వివరణ
ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవి నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓవైపు సరదా, మరోవైపు సామాజిక స్పృహ... ఈ విధంగా ఆయన సోషల్ మీడియా లైఫ్ సాగిపోతోంది. ఈ ఉదయం ఆయన చేసిన ట్వీట్ అభిమానుల నోరూరించిందంటే అతిశయోక్తి కాదు. "చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు ఈ సాయంత్రం 4 గంటలకు!" అంటూ చిన్న టీజర్ వదిలారంతే... అభిమానులు వేల రీట్వీట్లు, లైకులతో మోత మోగించారు. అయితే ఈ వీడియో విడుదల కార్యక్రమాన్ని చిరంజీవి వాయిదా వేసుకున్నారు. అందుకు కారణమేంటో చిరంజీవి మాటల్లోనే చూద్దాం! "విజయవాడలో జరిగిన విషాద ఘటనతో కలత చెందాను. అందుకే ఈ వీడియోను ఇవాళ పోస్టు చేయడంలేదు" అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha