Union Home Ministry: అమిత్ షా ఆరోగ్యంపై ఎలాంటి అసత్య ప్రచారం చేయొద్దు: కేంద్ర హోంశాఖ

Union Home Ministry clarifies on Amit Shah health status
  • అమిత్ షాకు నెగెటివ్ వచ్చిందటూ వార్తలు
  • అమిత్ షాకు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదన్న హోంశాఖ
  • పరీక్షలు నిర్వహిస్తే తామే వివరాలు వెల్లడిస్తామని స్పష్టీకరణ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నయమైందంటూ వచ్చిన వార్తలు ఈ మధ్యాహ్నం నుంచి జాతీయ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమిత్ షా ఆరోగ్యంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేసినట్టుగా అనేక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమిత్ షాకు మళ్లీ ఎలాంటి కరోనా పరీక్షలు నిర్వహించలేదని, అసలు కరోనా పరీక్షలు నిర్వహించుకుండానే నెగెటివ్ అని ఎలా వస్తుందని ప్రశ్నించింది.

అమిత్ షాకు తాజాగా ఎలాంటి కరోనా పరీక్షలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే ఆ వివరాలు తామే వెల్లడిస్తామని హోంశాఖ కార్యాలయం పేర్కొంది. అమిత్ షా ఆరోగ్యంపై ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దని హెచ్చరించింది. కాగా, అమిత్ షాకు నెగెటివ్ వచ్చిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ నేత మనోజ్ తివారీ ఆ తర్వాత తన ట్వీట్ తొలగించినట్టు తెలుస్తోంది.
Union Home Ministry
Amit Shah
Corona Virus
Negative
Gurgaon

More Telugu News