ఏ కష్టమొచ్చిందో!... పాక్ నుంచి వలస వచ్చిన హిందూ కుటుంబంలో 11 మంది ఆత్మహత్య
- జోధ్ పూర్ వలస వచ్చిన కుటుంబం
- కౌలు సాగు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న వైనం
- ఈ ఉదయం ఇంటిముందు విగతజీవుల్లా పడివున్న వ్యక్తులు
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఒక్క వ్యక్తి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రికి తరలించారు. 11 మంది మరణించినట్టు గుర్తించారు. వారి శరీరాలపై గాయాలేమీ లేకపోవడంతో, ఏదైనా విషం తీసుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదమే ఈ సామూహిక ఆత్మహత్యలకు దారితీసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.