విజయవాడ అగ్నిప్రమాదంపై చిరంజీవి దిగ్భ్రాంతి
- కొవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం
- 10 మంది మృతి
- ఇలాంటి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించాలన్న చిరంజీవి
విజయవాడలో కరోనా కేసుల ఉద్ధృతి కారణంగా కొన్ని హోటళ్లను కూడా కరోనా కేర్ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. రమేష్ ఆసుపత్రి హోటల్ స్వర్ణ ప్యాలెస్ ను కరోనా కేర్ సెంటర్ గా ఉపయోగిస్తోంది. అయితే ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు.