KTR: ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎంతో సమగ్రమైనది: కేటీఆర్

KTR answers on questions who asked him in Twitter
  • నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు
  • ఆస్క్ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ప్రశ్నోత్తరాలు
  • ఆయుష్మాన్ భారత్ పై కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజన్
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చే కార్యక్రమం షురూ చేశారు. ఆస్క్ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నిర్వహించే కార్యక్రమంలో ఓ నెటిజన్ ఆరోగ్యశ్రీపై కేటీఆర్ ను ప్రశ్నించాడు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదు? అని ప్రశ్నించాడు.

అందుకు కేటీఆర్ బదులిస్తూ, ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్యశ్రీ పథకం ఎంతో సమగ్రమైనదని, నిజానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకానికి రూపకల్పన చేసిందని తెలిపారు. అయితే, ఆ నెటిజన్, తెలంగాణలో కరోనా కష్టకాలంలో ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించగా, అందుకు కేటీఆర్ సమాధానం దాటవేశారు!
KTR
Answers
Questions
Twitter
Ayushman Bharat
Arogyasri
Telangana
Corona Virus

More Telugu News