Raghurama Krishna Raju: తన మనవడు మహేశ్ బాబుతో కలిసి ఉన్న ఫొటో పంచుకున్న రఘురామకృష్ణరాజు

Raghurama Krishna Raju shares an photo on the eve of Mahesh Babu birthday
  • ఇవాళ మహేశ్ బాబు పుట్టినరోజు
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • మహేశ్ బాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ అంటూ ట్వీట్ చేసిన రఘురామ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇవాళ 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మహేశ్ బాబుతో తన మనవడు తీయించుకున్న ఫొటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.

రఘురామకృష్ణరాజు మనవడు కారు బానెట్ పై ఠీవీగా కూర్చుని ఉండగా, మహేశ్ బాబు పక్కనే చిరునవ్వుతో నిల్చుని ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలతోనే కాకుండా, తన వ్యక్తిత్వంతోనూ అనేకమందిని అభిమానులుగా మార్చుకున్న మహేశ్ బాబుకు ఈ స్థాయిలో గ్రీటింగ్స్ వస్తుండడం ఆశ్చర్యమేమీ కాదు.
Raghurama Krishna Raju
Mahesh Babu
Birth Day
Grand Son
Tollywood

More Telugu News