Narendra Modi: దేశంలోని రైతుల కోసం రూ.లక్ష కోట్ల మౌలిక సదుపాయాల నిధి ప్రారంభం

  • ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం కింద నిధి
  • వ్యవసాయ రంగంలో స్వావలంబన కోసం ప్రయత్నాలు
  • 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం
  • 8.5 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున ఇవ్వనున్న కేంద్రం
modi launches farmers fund

ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నిధి ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం చేసుకున్నాయి.

8.5 కోట్ల మంది రైతులకు  రూ.2 వేల చొప్పున అందిస్తారు. ఇందు కోసమే దాదాపు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, రైతులు తమ పంట దిగుబడులను కాపాడుకునేందుకు సదుపాయాలను కల్పిస్తారు. దీంతో పాటు రైతులకు ఇచ్చే  రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్‌ గ్యారంటీ ఇస్తారు. కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా రైతులకు సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.

More Telugu News