అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరపాలని జగన్ ఆదేశించారు: ఆళ్ల నాని
- మృతిచెందిన వారికి సంతాపం
- అధికారులను అప్రమత్తం చేశాం
- సహాయకచర్యలు కొనసాగుతున్నాయి
ఈ అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని తాము వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామని ఆళ్ల నాని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని, నివేదిక సమర్పించాలనిసీఎం వైస్ జగన్ ఆదేశించారని తెలిపారు. ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని చెప్పారు. అనంతరం ఆయన ప్రమాద స్థలికి బయలుదేరారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే మంత్రి సుచరిత పర్యటించారు.