Disha: బాలీవుడ్ హీరో సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశ చివ‌రి వీడియో వైరల్

disha last video goes viral
  • ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య
  • అంతకు ముందు దిశ సూసైడ్
  • ఆత్మహత్యకు ముందు రోజే ఓ పార్టీలో పాల్గొన్న దిశ  
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ఆయ‌న‌ మాజీ మేనేజ‌ర్ దిశ సాలియ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు రాత్రి ఆమె ఓ పార్టీలో పాల్గొందని కూడా ఇప్పటికే తేలింది.

గత నెల 9న రాత్రి ముంబైలోని మలద్‌ ప్రాంతంలో తన ప్రియుడు రోహాన్‌ నివాసంలో జ‌రిగిన పార్టీలో ఆమె హుషారుగా పాల్గొన్న విషయానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇందులో దిశ ప్రియుడు రోహాన్‌ సహా మరికొందరు స్నేహితులు ఉన్నారు. ఓ బాలీవుడ్ పాటకి వారు డ్యాన్సు చేస్తూ కనపడ్డారు.

ఈ వీడియోని దిశ ఓ వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేసింది. కాగా, సుశాంత్ మృతి చెందడానికి ఒక్క రోజు ముందు గూగుల్‌లో తన పేరుతో పాటు దిశ పేరును కూడా సెర్చ్‌ చేసి తమ గురించి వస్తోన్న వార్తలను చదివినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వీరిద్దరి ఆత్మహత్యల ఘటనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Disha
Sushant Singh Rajput
Bollywood

More Telugu News