Narendra Modi: విజయవాడ అగ్నిప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం జగన్‌కి మోదీ ఫోన్‌

  • మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం
  • అగ్ని ప్రమాదంపై మోదీకి వివరాలు చెప్పిన జగన్
  • హోటల్‌ను ప్రైవేటు ఆసుపత్రి లీజుకు తీసుకుందన్న సీఎం
  • కరోనా బాధితులను ఉంచిందని వివరణ  
modi calls jagan

విజయవాడలోని కోవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు  రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

కాగా, అగ్ని ప్రమాదంపై సీఎం జగన్‌కు  ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోటల్‌ను ప్రైవేటు ఆసుపత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని మోదీకి సీఎం చెప్పారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని ప్రధానికి వివరించారు. దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని ఆయన అన్నారు.

కాగా, రమేశ్ ఆసుపత్రి లీజుకు తీసుకున్న ఆ హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌  కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

More Telugu News