Mahesh Babu: మహేశ్ బాబుకు మరపురాని బహుమతిని అందించిన ఫ్యాన్స్!

Maheshbabu Gifted from Fans
  • నేడు మహేశ్ బాబు బర్త్ డే
  • హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేసిన అభిమానులు
  • ఫాస్టెట్స్ 10 మిలియన్ ట్వీట్స్ రికార్డు
  • వరల్డ్ ట్రెండ్స్ తొలి స్థానం
నేడు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డేలు వస్తున్నాయంటే, సోషల్ మీడియాలో అభిమానుల హడావుడి ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ మధ్య ఎవరి పుట్టిన రోజు వచ్చినా, వారి పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి, దాన్ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

ఈ విషయంలో తమ అభిమాన హీరోకు ప్రిన్స్ ఫ్యాన్స్ మరపురాని బహుమతిని అందించారు. మహేశ్ బాబు పేరిట బర్త్ డే ట్యాగ్, వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు... వరల్డ్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ ట్వీట్స్ రికార్డును పట్టుకొచ్చింది. వరల్డ్ ట్రెండ్స్ లో హెచ్బీడీ మహేశ్ బాబు (#HBDMaheshBabu) నంబర్ వన్ గా నిలిచింది. ఈ విషయాన్ని నిన్న రాత్రి నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇక పుట్టినరోజుకు ముందురోజే ఇంత రికార్డు క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్, తదుపరి 24 గంటల్లో ఇంకెలా దూసుకెళుతుందో?!
Mahesh Babu
Birth Day
Fans

More Telugu News