IMA: కరోనా సోకి మరణించిన 196 మంది వైద్యులు... ప్రధాని తక్షణం కల్పించుకోవాలని ఐఎంఏ లేఖ!

196 Doctors Died due to Corona in India
  • ఫ్రంట్ లైన్ వారియర్స్ లో కరోనా భయం
  • అత్యధికులు జనరల్ ప్రాక్టీషనర్లే
  • బీమా సౌకర్యం కల్పించాలన్న మెడికల్ అసోసియేషన్
కరోనా సోకి మరణిస్తున్న వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఓ లేఖ రాసింది. వ్యాధి సోకిన వారికి సేవలందించే క్రమంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, వీరిలో అత్యధికులు జనరల్ ప్రాక్టీషనర్లేనని గుర్తు చేసింది.

ఇంతవరకూ 196 మంది వైద్యుల ప్రాణాలు పోయాయని వెల్లడించింది. ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న వారి రక్షణ కోసం చర్యలు చేపట్టాలని, వారి కుటుంబాలకు భద్రతను కల్పించేలా జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరింది. ఈ సౌకర్యాన్ని అన్ని రంగాలలోని వైద్యులకు అందించాలని సూచించింది.
IMA
Doctors
Corona Virus
India
Narendra Modi

More Telugu News