Rana Daggubati: దగ్గుబాటి రానా-మిహీకా బజాజ్ పెళ్లి ఫొటోలు ఇవిగో!

  • ఓ ఇంటివారైన రానా, మిహీకా
  • రామానాయుడు స్టూడియోస్ లో పెళ్లి
  • కరోనా నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో పెళ్లి
Photos of Rana and Miheeka Bajaj wedding held at Ramanaidu studios

టాలీవుడ్ నటుడు రానా, మిహీకా బజాజ్ ల పెళ్లి వేడుక పూర్తయింది. హైదరాబాదులో దగ్గుబాటి కుటుంబానికి చెందిన రామానాయుడు స్టూడియోస్ లో ఈ వివాహ మహోత్సవం జరిగింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అత్యంత పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించిన ఈ పెళ్లి కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించారు. రానా, మిహీకాల కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు బంధుమిత్రులు తప్ప జనసందోహానికి దూరంగా ఈ పరిణయం జరిగింది.  తాజాగా ఈ సెలబ్రిటీ మ్యారేజికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

More Telugu News